ఆపరేషన్ చేయూత.. లొంగిపోయిన 38 మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆఫీస్ లో నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన (38) మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ గారి ఎదుట లొంగిపోయారు. జిల్లా పోలీసులు మరియు 81BN & 141 BN CRPF అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు *ఆపరేషన్ చేయూత* కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీసు శాఖ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడిచిపట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి నిర్మలమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 38 మావోయిస్ట్ సభ్యులు..3 మహిళా సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారి ముందు లొంగి పోయారు. ఈ ఏడాది జనవరి-2025 నుండి ఇప్పటివరకు నిషేదిత మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేసిన 265 మంది మావోయిస్టుసభ్యులు వివిద హోదాలలో కొత్తగూడెం పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది.