అలా పోయినవి..ఇలా తెచ్చేశారు....

By Ravi
On
అలా పోయినవి..ఇలా తెచ్చేశారు....

తెలంగాణ పోలీసులు మరోసారి రికార్డ్ బద్దలు కొట్టారు. డ్రగ్స్ నివారణలో ప్రపంచస్థాయిలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొదటిస్థానంలో నిలిచి సీపీ సి.వి. ఆనంద్ దుబాయిలో జరిగిన కార్యక్రమంలో అవార్డ్ కైవసం చేసుకున్న సగంతి తెలిసిందే. తాజాగా మన పోలీసులు మరో రికార్డ్ కైవసం చేసుకొని అందరి మన్ననలు పొందారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 78వేల 114 మొబైల్స్ ఫోన్స్ రికవరీ చేసి వాటి యజమానులకు అందించారు. పోయిన, మిస్ అయిన దొంగతనానికి గురైన వాటి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ceir పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్స్ గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సిటీలో ఉన్న మూడు కమిషనరేట్ పోలీసులు సైబరాబాద్,  హైదరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు  సీఐడీ విభాగం చాలా చురుకుగా పని చేసిందనే చెప్పాలి.
గతంలో మొబైల్ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ కి వెళ్లినా అంతగా రెస్పాన్స్ వచ్చేది కాదు. Imei నెంబర్ ఆధారంగా అడపదడపా ఎప్పుడో ఒక ఫోన్ రికవరీ అయ్యేది. వీటిని చోరీ చేసిన దుండగులు imei నెంబర్ మార్చేసి మరి మార్కెట్ లో విక్రయించేవాళ్లు. బాధితుడు ఒక్కోసారి తనకు తెలియకుండా అదే ఫోన్ కొనే పరిస్థితులు ఉండేవి. ధర ఎక్కువగా ఉండే ఫోన్స్ దేశం దాటి పోయేవి. దీనితో రికవరీ శాతం అంతగా ఉండేది కాదు.  అందుకే గతంలో చాలా మంది ఫోన్ పోయిన పెద్దగా పట్టించుకునే వారు కాదు. బట్ ఇప్పుడు కంప్లైంట్ వచ్చిన కొద్దిరోజుల్లోనే ఫోన్ రికవరీ జరిగిపోతోంది. 2022లో ceir పోర్టల్ కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రారంభించారు. అనంతరం 2023 ఏప్రిల్ 19వ తేదీన తెలంగాణలో పోలీస్ శాఖలో ప్రవేశ పెట్టారు. అతి తక్కువ సమయంలో మిగతా ప్రాంతాల కన్నా 78వేలకు పైగా ఫోన్స్ రికవరీ చేసి తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. 
హైదరాబాద్ కమిషనరేట్ లో 11, 879, సైబరాబాద్ కమిషనరేట్ లో 10, 385, రాచకొండ కమిషనరేట్ లో 8, 681 ఫోన్స్ రికవరీ చేశారు. ఫోన్ మిస్ అయిన మరుక్షణమే ఫిర్యాదుతో పాటు ceir పోర్టల్ లో నమోదు చేసుకుంటే ఖచ్చితంగా దేశం దాటినా కూడా ఫోన్ రికవరీ చేయవచ్చు అని అధికారులు తెలియజేస్తున్నారు.  Ceir పోర్టల్ వచ్చాక ఆ సమస్య పోయిందని చెబుతున్నారు. పోర్టల్ నోడల్ ఏజెన్సీగా పని చేస్తున్న సిబ్బందిని, దానికి నేతృత్వం వహిస్తున్న సీఐడీ సిబ్బందిని డీజీపీ జితేందర్ అభినందించారు. సో ఫోన్ పోయిందని టెన్షన్ పడకుండా ఫిర్యాదు చేసి మీ ఫోన్ మీరు మళ్లీ రాబట్టుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. IMG-20250520-WA0115

Tags:

Advertisement

Latest News

#Draft: Add Your Title #Draft: Add Your Title
శ్రీ స్వామివారి దేవస్థానం నుండి బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయమునకు గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు...
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి
బంగారం పోయింది అని.. కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
తెలంగాణలో నకిలీ వైద్యులకు చెక్ పెట్టిన డిసిఏ అధికారులు
మేడిపల్లి సేజ్ స్కూల్ ఆవరణలో కట్టడాల కూల్చివేతలు
డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి