6గురికి ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డుల ప్రధానం

By Ravi
On
6గురికి ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డుల ప్రధానం

దక్షిణ మధ్య రైల్వే IMG-20250519-WA0113జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో  జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 2025 నెలకు గాను "ఎంప్లాయీ ఆఫ్ ది మంత్" సేఫ్టీ అవార్డులను ఆరుగురు ఉద్యోగులకు అందజేశారు. అసురక్షిత పరిస్థితులను నివారించడంలో అసాధారణమైన అప్రమత్తత మరియు అంకితభావాన్ని ప్రదర్శించిన రైల్వే సిబ్బందికి  ఈ అవార్డులు అందజేయ బడుతాయి. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్  నీరజ్ అగ్రవాల్ గారు, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతోపాటు మొత్తం 6 డివిజన్లు అనగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
అరుణ్ కుమార్ జైన్ జోన్‌ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన 6మంది ఉద్యోగులకు విధి నిర్వహణలో అప్రమత్తతను ప్రదర్శించినందుకు మరియు అసురక్షిత పరిస్థితులను నివారించి  సకాలంలో చర్యలు చేపట్టినందుకు సికింద్రాబాద్ డివిజన్ 02, విజయవాడ డివిజన్-02 మరియు గుంటూరు డివిజన్-02  “ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్” భద్రతా అవార్డులను అందజేసి వ్యక్తిగతంగా ప్రశంసించారు. ఈ అవార్డు గ్రహీతలలో ట్రాక్ మెయింటెయినర్లు, టెక్నీషియన్లు మరియు స్టేషన్ మాస్టర్ వంటి వివిధ డిపార్ట్మెంట్లకు  చెందినవారు ఉన్నారు . ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందించారు మరియు వారి విధులను అత్యంత అంకితభావంతో నిర్వర్తించడంలో వారి నిబద్ధతను అభినందించారు. ఈ అవార్డులు ఇతర ఉద్యోగులను మరింత అప్రమత్తంగా ఉండటానికి మరియు భద్రత నిర్వహణ కోసం నిజాయితీగా పనిచేయడానికి ప్రేరణనిస్తాయని మరియు వారిని ప్రేరేపిస్తాయని ఆయన పేర్కొన్నారు. 
తరువాత, జనరల్ మేనేజర్  ఈ సమావేశంలో సిబ్బంది పనివేళల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.  సిబ్బంది పనివేళలపై నిశితమైన విశ్లేషణలో రైళ్ల సమయపాలనను  లోతుగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైలు కార్యకలాపాల సమయపాలనను మరింత పెంచడానికి అన్ని సంబంధిత విభాగాలను కలిగి ఉన్న సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
శ్రీ అరుణ్ కుమార్ జైన్  రైల్వే భద్రతపై సమగ్ర సమీక్షలో, సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్ మరియు మెకానికల్ సహా బహుళ విభాగాలలో కొనసాగుతున్న భద్రతా డ్రైవ్‌ల పురోగతిని సమీక్షించారు. సిబ్బంది అప్రమత్తంగా మరియు అధిక భద్రతా ప్రమాణాలను నిర్వహించడంలో చురుగ్గా ఉండేలా క్షేత్ర స్థాయిలో నిరంతర  కౌన్సెలింగ్ సెషన్‌ల అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ చొరవ దక్షిణ మధ్య రైల్వే యొక్క కార్యాచరణ నైపుణ్యం మరియు భద్రత పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, అన్ని విభాగాలలో అప్రమత్తత మరియు బాధ్యత సంస్కృతిని బలోపేతం చేస్తుందని తెలిపారు .

 

Tags:

Advertisement

Latest News