కలిసికట్టుగా పండుగలు జరుపుకోండి

By Ravi
On
కలిసికట్టుగా పండుగలు జరుపుకోండి

IMG-20250519-WA0108గ్రామాల్లో కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంతో పాటు ఐక్యతగా వర్ధిల్లాలని రంగారెడ్డి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కౌన్సిల్ జిల్లా మాజీ చైర్మన్, కేశంపేట మాజీ జెడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు పేర్కొన్నారు. ఫరూఖ్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో బొడ్రాయి పండుగ, శివాలయ పునర్నిర్మాణం ధ్వజస్తంభ ఏర్పాటు కార్యక్రమాలకు విశాల శ్రావణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఆహ్వానం పలికి సన్మానం చేశారు. పూజల అనంతరం వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన నాడే గ్రామాల్లో శాంతి వాతావరం నెలకొంటుందని గ్రామం సర్వతముఖాభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. గ్రామ పండుగ కోసం తమన ఆహ్వానించినందుకు గ్రామ పెద్దలకు ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు హాజరయ్యారు..

Tags:

Advertisement

Latest News