కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్

By Ravi
On
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్

నిత్యం పోలీసులు.. వారి విధులతో బిజీగా ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక్కసారిగా కలర్ ఫుల్ గా మారింది. హైదరాబాద్ సీపీ సీనియర్ ఐపీఎస్ సి.వి. ఆనంద్ నేతృత్వంలో పలువురు సీనియర్ అధికారులు అందాల భామలకు ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను మరియు భద్రతా వ్యవస్థను ప్రదర్శిస్తూ, 72వ మిస్ వరల్డ్ ఉత్సవంలో భాగంగా పాల్గొన్న అందాల భామలు ఈ రోజు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) ని సందర్శించారు. ఈ సందర్శన ద్వారా తెలంగాణ భద్రతాపరంగా మరియు పర్యాటక పరంగా ఎంత ముందుందో ప్రత్యక్షంగా చూపించగలిగింది.
విశేష ఆకర్షణగా, పోటీదారులను ఘనంగా మౌంటెడ్ పోలీస్ ఎస్కార్ట్ స్వాగతించింది. వీరిమధ్య క్రమశిక్షణ మరియు శక్తిని ప్రతిబింబించే మౌంటెడ్ పోలీస్ ప్రదేశంలోకి తీసుకువచ్చారు. ఆ తరువాత పైప్ బ్యాండ్ ప్రదర్శన,  శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్  షోతో వేడుక కొనసాగింది. ఈ జాగిలాల చురుకుతనం తెలంగాణ పోలీస్ కే9 యూనిట్ శిక్షణ ప్రమాణాలను ప్రతిబింబించాయి.
ఈ సందర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోటీదారులు తెలంగాణ పోలీసుల చేతిలో వుండే ఆధునిక ఆయుధాలను మరియు రక్షణ పరికరాలను సమీక్షించారు. ఆ తరువాత TGICCC లో ప్రవేశించిన పోటీదారులు, హైదరాబాద్ నగర భద్రత వ్యవస్థ యొక్క మూలస్థంభంగా ఉన్న ఆధునిక సాంకేతికతను ప్రత్యక్షంగా చూశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేది అత్యాధునిక సదుపాయాలతో కూడిన కేంద్రంగా ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా మరియు సమన్వయంగా స్పందించేందుకు రూపొందించబడింది. ఇక్కడ భద్రతా వ్యవస్థలు, సర్వేలెన్స్ ఫీడ్లు, మరియు అత్యవసర స్పందన వ్యవస్థలను డేటా అనలిటిక్స్ మరియు కృత్రిమ మేధస్సుతో ఏకీకృతం చేస్తూ ఎలా పనిచేస్తున్నాయో పోటీదారులకు చూపించారు. సందర్శన ముగింపులో తెలంగాణ సంప్రదాయ కళలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. 
ఈ సందర్భంగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ మరియు సీఈఓ జూలియా మార్లీ సీబీఈ మాట్లాడుతూ భద్రత మరియు నూతనతకు తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటు ఎంతో ప్రేరణ కలిగించేలా ఉందని TGICCC ఆధునిక policing మరియు సాంకేతికత కలయికగా ప్రపంచ స్థాయిలో ఒక ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భద్రతా వ్యవస్థలు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంత ముఖ్యమైనవో ఈ సందర్శన పోటీదారులకు తెలియజేసిందిని చెప్పారు. అనంతరం ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ట్రాన్స్ జెండర్స్ ని పలకరించిన సుందరీమణులంతా వారితో సెల్ఫీ దిగి అభినందించారు.IMG-20250518-WA0129

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం