తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం
ఎన్ఫోర్స్ మెంట్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి మూడు చోట్ల దాడులు నిర్వహించి 6740 కేజీల బెల్లం, 250 పటిక స్వాదీనం. చేసుకున్నారు. పట్టుకున్న బెల్లం పట్టిక విలువ రూ.11 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో లారీలో అక్రమంగా వెళుతున్న 8000 కేజీల బెల్లం 200 కేజీల పట్టికను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే నల్లగొండ జిల్లా కొండాళ్ మల్లేపల్లి రోడ్ లో అశోక్ లేలాండ్ లో వెళ్తున్నవాహనంలో 2400 కేజీల బెల్లం 30 కేజీల పటికెను దేవరకొండ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్ ఖానాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ సిబ్బంది బైక్ పై తీసుకు వెళుతున్న 340 కేజీల బెల్లాన్ని 20 కేజీల ఆలమును ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెల్లం ఆలమును స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్ చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులను డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు.