విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్
By Ravi
On
బార్ కో.. పబ్బుకో.. స్నేహితులతో పార్టీకి వెళ్తే వేలకు వేలు ఖర్చు అవుతుందని భావించిన కొందరు ఏకంగా ఢిల్లీ గోవా ప్రాంతాలకు నుంచి ఖరీదైన మద్యం బాటిళ్లను తెప్పించుకొని జల్సాలు చేస్తుంటారు. ఎవరికైనా విదేశీ మద్యం బాటిల్ అవసరం ఉందంటే వారికి ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఖరీదైన విదేశీ మద్యం బాటిలను ఇనోవా కార్లో తరలిస్తుండగా ఓ టీమ్ ను ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. పట్టుబడిన వారి నుండి 52 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 3.60 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. బిర్లా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ఆదర్శనగర్ లో కారులో మద్యం బాటిల్లను తరలిస్తున్న సమయంలో దాడి చేసి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుమార్ అగ్రవాల్, రోహిత్ కుమార్ లను అరెస్ట్ చేయగా, సురేనియా చంద్ర దీప్ పరారీలో ఉన్నట్లు ఎస్టిఎఫ్ టీం వెల్లడించారు.
Tags:
Latest News
18 May 2025 13:46:05
పాతబస్తీ చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని మలక్ పేట యశోద ఆస్పత్రితో...