పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు

By Ravi
On
పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు

సుందరీ మణుల రాకతో ముస్తాబైన చార్మినార్ ప్రాంతం ఒక్కసారిగా హాహా కారాలతో నిండిపోయింది. ఫైర్ ఇంజన్ల చప్పుడు, జనాల కేకలు, అంబులెన్స్ ల మోతతో దద్దరిల్లిపోయింది.  రెండు షాపుల్లో చెలరేగిన మంటలు 22 మంది గాయపడేలా చేసింది. వీరిలో 8మంది మృతి చెందగా మిగతా వారిని మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించారు. సుమారు 6 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్థానిక వాటర్ వర్క్స్ అధికారులు ఫైర్ ఇంజన్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. అటు పోలీసులతో పాటు స్థానికులు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీ తరలించారు.

Tags:

Advertisement

Latest News

పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య
పాతబస్తీ చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని మలక్ పేట యశోద ఆస్పత్రితో...
పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు
విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 16మందికి గాయాలు.. మంటల్లో మరికొందరు
మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా. అయితే మీరు డేంజర్ లో పడినట్లే
డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు
రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి