పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య

By Ravi
On
పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య

పాతబస్తీ చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని మలక్ పేట యశోద ఆస్పత్రితో పాటు కాన్చన్ బాగ్ అపోలో డిఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. మృతులు బెంగాల్ వాసులని తెలిసింది. సమ్మర్ హాలిడేస్ కావడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ వద్ద బంధువుల ఇంటికి వచ్చినట్లు, తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఊపిరాడక చాలా మంది చనిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే పలువురు మంత్రులు, మేయర్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటన స్థలానికి వచ్చిన డీజీపీ జితేందర్, ఫైర్ డిజి నాగిరెడ్డి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మరోపక్కన సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ పలువురు ప్రజాప్రతినిధులు తమ సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనగా ఉందని 48గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రమాదంపై అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News