103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
By Ravi
On
సంగారెడ్డిజిల్లా గుమ్మడిదల మండలం ప్యారా నగర్ నల్లవల్లిలో డంపింగ్ యార్డ్‌ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 103వ రోజుకు చేరుకుంది. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఈ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం అన్యాయమని ఆయన అన్నారు. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Latest News
18 May 2025 18:36:31
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...