ఎదులబాద్ గ్రామపంచాయతీ అవకతవకల్లో బిల్ కలెక్టర్ అరెస్ట్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధి ఎదులబాద్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 2021 నుండి 2022 సంవత్సరంలో గ్రామపంచాయతీలో 17లక్షల 25వేల రూపాయల అవకతవకలకి పాల్పడ్డారని అప్పటి సర్పంచ్ కాలేరు సురేష్, పంచాయతీ సెక్రెటరీ డి.ఉషా, బిల్ కలెక్టర్ గాలిపల్లి రజినీకర్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. ఎదులాబాద్ గ్రామం నందు గృహ నిర్మాణ అనుమతులకు వచ్చిన డబ్బులు టాక్స్ ల రూపంలో వాసులైన డబ్బులను ఫేక్ రిసిప్టులు, నకిలీ గృహ అనుమతులు ఇచ్చి దోపిడీ చేశారని అప్పటి సర్పంచ్, బిల్ కలెక్టర్, పంచాయతీ సెక్రెటరీపై కలెక్టర్ కి ఫిర్యాదు అందింది. దీనితో కలెక్టర్ ఆదేశాలతో డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పద్మజారాణి ఆధ్వర్యంలో విచారణ చేసి ఘట్కేసర్ పీఎస్ నందు ఫిర్యాదు చేశారు.విచారణ చేపట్టిన పోలీసులు ఈ బిల్ కలెక్టర్ గాలిపల్లి రజినీకర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అప్పటి సర్పంచ్ కాలేరు సురేష్, పంచాయతీ సెక్రెటరీ డీ. ఉషాలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎదులాబాద్ ఘట్కేసర్ మున్సిపాలిటీలో విలీనం అయి ఉంది.