మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా. అయితే మీరు డేంజర్ లో పడినట్లే

By Ravi
On
మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా. అయితే మీరు డేంజర్ లో పడినట్లే

మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా.. ఉన్నా ట్రాఫిక్ పోలీసులకు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు చలన పడకుండా నెంబర్ ప్లేట్ వంచడం కానీ, ఏదైనా నెంబర్ మీద స్టిక్కర్స్ అతికించడం చేస్తున్నారా.. అది చూసి మీ స్నేహితులు ఫాలో అవుతున్నారా. అయితే ఆ ఆలోచనలు పక్కన పెట్టి ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటున్నారు పోలీసులు. హైదరాబాద్ లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానా కాదు ఏకంగా వాహనం సీజ్ చేస్తున్నారు. తప్పించుకోవాలని చూస్తే వెంటపడి, చేజ్ చేసి మరీ మీ వాహనం స్వాధీనం చేసుకుంటున్నారు. కేవలం  వెస్ట్ జోన్ పరిధిలో ఒక్కరోజులోనే 890 వాహనాలు సీజ్ చేశారు. ఆ వాహనాలు అన్ని నెంబర్ ప్లేట్ లేనివే. కొత్తగా కొన్న వాటికి రిజిస్ట్రేషన్ లేకుండా నెలల తరబడి వాడుతున్నవారికి కూడా టీఫిక్ పోలీసుల చేతిలో దండన తప్పలేదు.  
ఆ లిస్ట్ ఇదిగో...
బంజారా హిల్స్..109
మసబ్ ట్యాంక్..63
జూబ్లీ హిల్స్..156
ఫిల్మ్ నగర్...155
పంజాగుట్ట..102
మధురానగర్ ..120
ఎస్.ఆర్. నగర్.. 99
బోరబండ.. 86
మొత్తం —  890 వాహనాలు సీజ్ చేశారు.  ఇక సిటీ మొత్తం కలిపితే ఒక్కరోజులోనే వేల సంఖ్యలో ఉన్నాయి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఒక్కసారి సీజ్ అయితే మీరు సారి చెప్పినా, బ్రతిమిలాడినా, రికమండేషన్ కాల్స్ చేయించినా బండి మాత్రం వదలరు. కోర్ట్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి  లాయర్ ని పెట్టుకొని జరిమానా జైల్ అనుభవిస్తే కానీ ఈ బండి మీకు దక్కదు. సో రూల్స్ పాటించండి.. సాఫీగా సాగిపోండి అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Tags:

Advertisement

Latest News

పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య
పాతబస్తీ చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని మలక్ పేట యశోద ఆస్పత్రితో...
పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు
విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 16మందికి గాయాలు.. మంటల్లో మరికొందరు
మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా. అయితే మీరు డేంజర్ లో పడినట్లే
డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు
రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి