పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 16మందికి గాయాలు.. మంటల్లో మరికొందరు

By Ravi
On
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 16మందికి గాయాలు.. మంటల్లో మరికొందరు

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 
చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్  కృష్ణ పెరల్స్ అండ్ మోదీ పెరల్స్ లో షాప్స్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పై అంతస్తులో నివాసం ఉంటున్న జనం బయటకి రాలేక మంటల్లో చిక్కుకు పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.  మంటల్లో చిక్కుకు ని గాయపడిన 16 మందిని రక్షించి బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరికొందరు  భవనంలో ఉన్న వారిని రెస్క్యూ చేస్తున్న ఫైర్ సిబ్బంది వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. IMG-20250518-WA0008

Tags:

Advertisement

Latest News