యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
మధురానగర్ లో తీవ్ర కలకలం రేగింది. పెంపుడు కుక్క కరిచి వ్యక్తి మృతి చెందడంటూ ప్రచారం జరగడంతో జనం ఆ ఇంటికి పోటెత్తారు. స్థానిక ప్రాంతంలో ఉన్న పవన్ కుమార్ అనే వ్యక్తిని కుక్కను పెంచుకుంటున్నాడు. ఆదివారం రాత్రి ఎంతకీ ఫోన్ తీయక పోవడంతో అనుమానం వచ్చిన స్నేహితుడు ఇంటికి వచ్చి చూసేసరికి హాల్ లో పవన్ డెడ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే ఉన్న అతని పెంపుడు కుక్క నోటికి రక్తం ఉంది. కంగారు పడ్డ అతను పరుగున వెళ్లి మధురానగర్ పిఎస్ లో తన స్నేహితుడు పవన్ ని పెంపుడు కుక్క కరిచి చంపింది అని ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా హత్య చేసిన తరువాత యజమానిని లేపే ప్రయత్నం చేసిందా లేక కుక్కే కరిచి చంపిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి అయితే కానీ చెప్పలేమన్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాలు పరిశీలిస్తున్నారు. మృతుడి శరీరంపై చాలాచోట్ల కుక్క కరిచిన గాట్లు ఉన్నాయి.