పరీక్ష బహిష్కరించి నిజాంకాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన

By Ravi
On
పరీక్ష బహిష్కరించి నిజాంకాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన

బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.  విద్యార్థుల జీవితాలతో కాలేజ్ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకొని ఇప్పుడు 75 శాతం అటెండెన్స్ లేదని  హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ కు చెందిన 350 మంది విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ప్రిన్సిపాల్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగే 6వ సెమిస్టర్ ఎగ్జామ్ ను బహిష్కరించిన తోటి విద్యార్థులు అందరికి హాల్ టికెట్స్ ఇస్తేనే ఎగ్జామ్ రాస్తామంటూ ఆందోళన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Tags:

Advertisement

Latest News