కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..!

By Ravi
On
కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..!

బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పరిశీలించారు. సర్వే నెంబర్ 102/1లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి పెన్సింగ్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కూల్చివేసిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 102/1 సర్వ్ నెంబర్‌లో కబ్జాకి గురైన ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని రికార్డుల ఆధారంగా రెవెన్యూశాఖ అధీనంలోకి తీసుకుందని చెప్పారు. దీనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి తీర్చిదిద్దుతారని చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోకి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Latest News