చాదర్ ఘాట్ లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ..

By Ravi
On
చాదర్ ఘాట్ లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ..

ఫ్రిజ్ లో పండ్లు తిని..

కిచెన్ లో భోజనం చేసి మరీ చోరీ చేసిన దొంగలు

రంగంలోకి దిగిన క్లూస్ టీమ్..డాగ్ స్క్వాడ్

వెనుక డోర్ నుండి పారిపోయిన దుండగులు

చాదర్ ఘాట్ లో భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ఫహిముద్దీన్ భార్య తన సోదరికి ఆరోగ్యం బాగలేక పోవడంతో  చూసేందుకు వెళ్లింది. ఇంట్లో ఫహిముద్దీన్ పిల్లలు ఓ గదిలో పడుకొని ఉండగా ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బయట నుండి వారి గదికి గొళ్లెం పెట్టారు. ఆ తరువాత ఫ్రీజ్ లో ఉన్న పండ్లు, కిచెన్ లో ఉన్న ఆహారపదార్థాలు తాపీగా భోజనం చేసి మరీ చోరీ చేశారు.  బీరువాలో ఉన్న 75తులాల బంగారం, రూ. 2.50లక్షల క్యాష్ తో వెనుక డోర్ నుండి రైల్వే ట్రాక్ గుండా పారిపోయారు. ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది తెలిసిన వారి పనే అని, లేదా రెక్కీ చేసిన తరువాతే అదును చూసి చోరీ చేసినట్లు భావిస్తున్నారు. చోరీకి పాల్పడిన వారి కోసం ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దింపారు.

Tags:

Advertisement

Latest News