తెలంగాణలో పలు చోట్ల డిసిఏ దాడులు

By Ravi
On
తెలంగాణలో పలు చోట్ల డిసిఏ దాడులు

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆదిలాబాద్‌లో 'హెర్బల్ ఫీవర్ గార్డ్ సిరప్' అనే ఆయుర్వేద మందును స్వాధీనం చేసుకున్నారు. ఈ మందు 'అన్ని రకాల జ్వరాలకు చికిత్స చేస్తుంది' అనే తప్పుడు ప్రకటనతో అమ్మకాలు జరువుతున్నారని, జ్వరం అనేది సాధారణంగా శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్‌కి లేదా అంతర్గత సమస్య వల్ల వస్తుందని ఈ సిరప్ వల్ల జ్వరం తగ్గుతుందని అనుకోవడం భ్రమ అన్నారు. మార్కెట్లో ఇలాంటి నకిలీ సిరప్ల వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
మరో సంఘటనలో
సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో ఉన్న ఓ క్వాక్ (నకిలీ డాక్టర్) క్లినిక్‌పై దాడి నిర్వహించి, అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ స్వాధీనం చేసుకున్నారు. 2024 జనవరి నుండి ఇప్పటి వరకు, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 161 మంది నకిలీ డాక్టర్ల భరతం పట్టడమే కాకుండా వారి క్లినిక్ లో నిల్వ ఉంచిన మందులను సీజ్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. నకిలీ మందులు, డూప్లికేట్ డాక్టర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Tags:

Advertisement

Latest News

ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్ సి. హరి కిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొత్త డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం చేపట్టిన ఎన్‌పీడీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ మంచి ఫలితాలను ఇచ్చాయి. వారం...
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు
ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కి యత్నం.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్
మేడ్చల్ సొసైటీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్