మేడ్చల్ లో ప్రయాణిస్తున్న బస్ లో చెలరేగిన మంటలు

By Ravi
On
మేడ్చల్ లో ప్రయాణిస్తున్న బస్ లో చెలరేగిన మంటలు

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది.  మేడ్చల్ మండలంలోని బండ మైలారం నుండి కొంపల్లికి వెళ్తుండగా మేడ్చల్ ఐటిఐ  వద్ద  రాగానే ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. దీంతో  డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపాడు. క్షణాలో చూస్తుండగానే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజన్ లో నుండి మంటలు చెలరేగి బస్సు దగ్ధమైందని డ్రైవర్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందించారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా విచారణకు...
గాలిజనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ
బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి
పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్
ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు