చెక్కులు సరే.. తులం బంగారం ఏది.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

By Ravi
On
చెక్కులు సరే.. తులం బంగారం ఏది.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో కళ్యాణ లక్ష్మి,. షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని అన్నారు. మహేశ్వరం ఎంపీడీవో  కార్యాలయంలో  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన 184 చెక్కులను అందజేశారు.మహిళలకు రూ.2,500 ఎప్పుడిస్తారు....కేసీఆర్‌ కిట్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చెక్కులు ఇచ్చి చేతులు దులపుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చాలని అన్నారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వమైనా అమలు చేయవలసిందే అన్నారు. మహిళలకు ఉచిత బస్సుతోపాటు రూ.2,500లు ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆడబిడ్డలు బిందెలు తీసుకొని రోడ్ల మీదకు రావద్దని మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. ముందుచూపుతో కేసీఆర్‌ అనేక పథకాలు తీసుకొచ్చారని, ఇప్పుడు ఇస్తున్న చెక్కులు కెసిఆర్ హయాంలో మంజూరు అయినవే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు బిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News