మన అంతర్గత శత్రువును ఓడించండి.. ఎక్స్ లో సీనియర్ ఐపీఎస్ రమేష్ మస్తిపురం పిలుపు

By Ravi
On
మన అంతర్గత శత్రువును ఓడించండి.. ఎక్స్ లో సీనియర్ ఐపీఎస్ రమేష్ మస్తిపురం పిలుపు

సరిహద్దుల్లో శాంతి నెలకొంది మన శత్రువులకు మనమేంటో చూపించాము.. బట్ మన అంతర్గత శత్రువును వదిలేస్తున్నాము.. అదే బెట్టింగ్ యాప్స్ రూపంలో మనపై విరుచుకుపడే ఆయుధంగా మారుతోంది.. ఇది గుర్తించండి మేల్కొనండి అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి రమేష్ మస్తీపురం ఎక్స్ వేదికగా అన్నారు. ఆయన చెప్పిన మాటలు..
వట్టిమాటలు కట్టిపెట్టోయ్ !
గట్టి మేల్ తలపెట్టవోయ్ !!
గత 20 రోజులుగా, గాయపడిన మనందరి హృదయాల్లో నిండిన ఉద్వేగాన్ని, శత్రు దేశం పై వివిధ రూపాల్లో ప్రదర్శించాము. ప్రత్యక్ష శత్రువు గురించి మనందరికీ తెలుసు. మరి పరోక్ష, అంతర్గత శత్రువు గురించి ఎంతమందికి తెలుసు ? తెలిసినా, ఎందుకు దాని గురించి మౌనంగా ఉన్నారు ? ఫోన్లతో బెట్టింగ్ యాప్స్ ద్వారా భారతీయులు కోల్పోతున్న డబ్బు మన కష్టార్జితం కాదా ?  ఇలా మనం పోగొట్టుకున్న డబ్బు తీరం దాటిపోయి, తిరిగి మన దేశం పై యుద్ధం చేయడానికి వాడే అవకాశం లేదా ? బెట్టింగ్ యాప్స్ తో నలిగి పోతున్న మన యువతను, వారి కుటుంబాలను తద్వారా మన దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  నిజమైన దేశభక్తులు అందరూ ఆలోచించాలి, మన వారిని అప్రమత్తం చేయాలి. బెట్టింగ్ యాప్స్ మత్తు వదలాలి మౌనం వీడాలి 💪 అని ఆయన కోరారు. ఒక్కసారి ఆయన చెప్పిన మాటలు అర్ధం చేసుకుంటే ఖచ్చితంగా యాప్స్ కి బానిసైన వారికి కనువిప్పు కలగడం ఖాయం.Screenshot_20250514_104513_X

Tags:

Advertisement

Latest News