జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన జీవన్గీ మహిళలు

By Ravi
On
జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన జీవన్గీ మహిళలు

ఒంటరి, నిరుపేద మహిళలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్ అంటూ జీవన్గి మహిళలు జిల్లా కలెక్టర్ ను కోరారు. బషీరాబాద్ మండలం జీవన్గి చెందిన మహిళలు బుధవారం వికారాబాద్ జిల్లా ప్రతీక్ జైన్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నిరుపేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ నేతలు అనుకూలంగా ఉన్నవారి పేర్లు రాసుకొని నిరుపేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇండ్ల వెరిషీకేషన్ కోసం ఈ నెల 10న గ్రామానికి అధికారులు వచ్చారు. దీంతో కాంగ్రెస్ లీడర్లు, యువకులు, మహిళల మధ్య గొడవ చోటు చేసుకుంది. తర్వాత యువకులు, మహిళలు అధికారులను అడ్డుకొని నిలదీశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓ కాంగ్రెస్ లీడర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీకి చెందిన వారే కొందరు చెబుతున్నారు.ఈ సారీ ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

Tags:

Advertisement

Latest News