వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పౌరసరఫరాల మేనేజర్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పౌరసరఫరాల మేనేజర్ సుగుణ బాయి మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి, లక్ష్మాపుర్, కేశవరం, జగన్ గూడా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం కొనుగోలు కేంద్రం రికార్డులు పరిశీలించారు. ఈ సందర్బంగా పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ బాయి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో తగినంత హమాలీలను ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, వడ్లు దింపుకొను సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. అదేవిదంగా త్రాగునీటి ఏర్పాటు చేయాలని, ధాన్యం కొన్న వెంటనే ట్యాబ్ (ఆన్ లైన్) లో రైతు వివరములు నమోదు చేయవలసిందిగా కొనుగోలు ఇన్చార్జ్ లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో ఉన్న రైతులతో మాట్లాడి వారికీ ధాన్యం తీసుకువచ్చే ప్రక్రియలో బాగంగా వడ్లను తడి, తాలు, దుమ్ము లేకుండా తూర్పారబట్టి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావలసిందిగా రైతులకు సూచించారు. తనిఖీలో బాగంగా వెంకటరమణ రైస్ మిల్ లో సోదాలు నిర్వహించి రైస్ మిల్లు ధాన్యం దిగుమతి రికార్డులు పరిశీలించి రైస్ మిల్లర్ కి తగు సూచనలు ఇచ్చారు. ధాన్యం వచ్చిన వెంటనే దిగుమతి చేసుకోవలసిందిగా ఆదేశాలు జారీచేయడం జరిగింది.