మూడుచింతలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం అయ్యింది. ధాన్యం కొలుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు సూచించారు. రైతాంగం పండించిన ప్రతి గింజను సొసైటీలోనే అమ్మాలని రైతులకు ఎంపి ఈటల రాజేందర్ సూచించారు. రైతులు దలారులను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి దాన్యాన్ని అమ్మాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనసాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రంను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింహులు యాదవ్, డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్, శామీర్ పేట్ సొసైటీ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, శామీర్ పేట్ సొసైటీ వైస్ ఛైర్మన్ ఐలయ్య యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.