శంషాబాద్ లో ఎక్సైజ్ దాడి.. 72కల్తీ మద్యం బాటిళ్లు స్వాదీనం
మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతోందా లేక ఫంక్షన్ హాల్స్ లో ఏదైనా విందు ఏర్పాటు చేశారా.. అయితే సార్.. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఖరీదైన మద్యం బాటిళ్లు ఉన్నాయి.. మద్యం దుకాణాల్లో లభించే మద్యం బాటిళ్ల ధరలపై రూ. 500 నుంచి రూ.వేయి తగ్గింపు ధరలకు వస్తాయని నమ్మబలికి మద్యం సరఫరా చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కల్తీ మద్యం బాటిళ్లకు ఢిల్లీ లేబుల్స్ అతికించి తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది చెక్ పెట్టారు. 72 మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతంలో జరుగుతున్న ఒక ఫంక్షన్ ముఠా మద్యాన్ని సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు కారులో నాలుగు కాటన్లలో మద్యం బాటిళ్లను తరలిస్తున్న సమయంలో శంషాబాద్ డి టి ఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు. 72 మద్యాం బాటిళ్లు(54 లీటర్ల ) , కారును, రెండు సెల్ ఫోన్లను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 20లక్షలు ఉంటుందని తెలిపారు. ఫంక్షన్ ని బట్టి నాసిరకం మద్యాన్నీ ఖరీదైన బాటిళ్లలో నింపి ఢిల్లీ లేబుల్స్ అతికించి మరీ బోల్తా కొట్టిస్తున్నారని, ఇలాంటి వారు సంప్రదిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.