డ్రైనెజ్ నీటితో తల్లడిల్లుతున్న తండా వాసులు.. పత్తా లేని అధికారులు

By Ravi
On
డ్రైనెజ్ నీటితో తల్లడిల్లుతున్న తండా వాసులు.. పత్తా లేని అధికారులు

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిల్లాపూర్ తండాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం రావడంతో డ్రైనేజీ నీరు ఒక్కసారిగా ఇండ్లలోకి వచ్చింది. స్థానిక తండా వాసులు ఇండ్లల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం నుంచి డ్రైనేజ్ విషయం గురించి స్థానిక ఎల్లయ్య  శానిటేషన్ అధికారికి చెప్పిన  పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు డ్రైనేజీ నీటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి టాక్స్ ల విషయంలో అయితే ప్రజల నుండి ముక్కు పిండి ఇంటి టాక్స్ లను వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు మరి  ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాత్రం ఎందుకు స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News