వికారాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ

By Ravi
On
వికారాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ

ప్రతి పేదవాడికి ఆత్మ స్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.  సోమవారం వికారాబాద్  పట్టణ కేంద్రంలో 32  కోట్ల నిధులతో నిర్మించిన  300 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రినీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్,  ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి, లతో కలిసి మంత్రి దామోదర నరసింహ ప్రారంభించారు. ఆస్పత్రిలోని అన్ని ఏర్పాట్లు సౌకర్యాలను వైద్యులచే అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా. నర్సులు,  హెడ్ నర్సులు జనరల్ ఆసుపత్రిలో కావలసిన మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి మరింత తీసుకుని వచ్చి విస్తరింప చేస్తామన్నారు. అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ప్రతి 37 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని దీనివల్ల ఎంతో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడేలా అత్యాధునిక వసతులతో ట్రామా కేర్ సెంటర్లు అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఇటీవలే 213 కొత్త అంబులెన్స్ లను  సీఎం రేవంత్ రెడ్డి  ప్రారంభించారని,  భవిష్యత్తులో మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీవో వాసు చంద్ర, డిఎం హెచ్ఓ వెంకటరమణ, డి సి హెచ్ఓ ఆనంద్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, పిఎసిఎస్ చైర్మన్ లు పరశురాం రెడ్డి, యాదవ రెడ్డి, తహాసిల్దార్ ఆనంద్, ఎంపీడీవో ఖరీం లు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు