హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
By Ravi
On
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలోని సెంట్రల్ పార్క్ పక్కన వీక్లి మార్కెట్ లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కూరగాయల మార్కెట్ లో లెడ్ లైట్లు సప్లై చేసే విషయంలో మృతుడు సిద్దిక్ అలాగే అహ్మద్ అనే వ్యక్తికి మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అహ్మద్ అతని నలుగురు సన్నిహితులతో కలిసి, సిద్ధిక్ పై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి,హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, ఒక ద్వి చక్ర వాహనం స్వాదీన పరుచుకున్నామని పేట్ బషీరాబాద్ లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు .
Tags:
Latest News
12 May 2025 19:57:59
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...