దుండిగల్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు..!

By Ravi
On
దుండిగల్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు..!

మేడ్చల్ జిల్లా దుండిగల్ మునిసిపల్ పరిధిలో బహదూర్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతం మాట్లాడుతూ.. రైతులకు భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ.. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వము భూ భారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు. రికార్డులలో తప్పుల సవరణకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్‌, పట్టాదారు పాసు పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తెలిపారు. రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని.. అధికారులు ఏమి పట్టించుకోవడంలేదని కొంతమంది నాయకులు నినాదాలు చేయడంతో.. కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెటింగ్ చైర్మన్, గ్రంధాలయ చైర్మన్, పీసిరీ కృష్ణారెడ్డితోపాటు అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..

Tags:

Advertisement

Latest News