తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌..!

By Ravi
On

2025-04-26 14_21_08తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు జరిపాయి. అధునాతన ఆయుధాలతోపాటు సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై భద్రత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. కర్రెగుట్టలో మావోయిస్టులను మూడువైపులా భద్రత దళాలు చుట్టూముట్టాయి. మావోయిస్టుల కోసం దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Latest News