ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత

By Ravi
On
ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల క్షేమం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం  ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ దాడులు చేసే అవకాశం ఉండడంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపింది. యాత్ర ఎప్పటి వరకు రద్దు, తిరిగి ఎప్పుడు ప్రారంభించే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైన విషయం తెలిసిందే. యమునోత్రి, గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ 30న తెరుచుకోగా కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 2న, బద్రీనాథ్ ధామ్ తలుపులు మే 4న తెరుచుకున్నాయి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులను యాత్రకు అనుమతిస్తారు. హిందువులకు అత్యంత ముఖ్యమైన ఈ యాత్ర హిమాలయాల్లోని యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్ నాథ్ మీదుగా వెళ్లి బద్రీనాథ్ తో ముగుస్తుంది.

Tags:

Advertisement

Latest News

భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు దేవాదాయ శాఖ కమిషనర్  ఉత్తర్వుల మేరకు  ప్రత్యేక పూజలు...
గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన
డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్
బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత