స్పెషల్ డ్రైవ్ దాడులతో దడ పుట్టిస్తున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరి అరెస్ట్
స్పెషల్ డ్రైవ్ పేరుతో ఎక్సైజ్ పోలీసులు దాడులతో దడ పుట్టిస్తున్నారు. మలక్‌పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎస్‌హెచ్‌ఓ నరేందర్ పర్యవేక్షణలో ఓ ఇంటిపై దాడులు నిర్వహించి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.3లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మలక్‌పేట్ సంతోష నగర్ ఈదీబజార్ ప్రాంతంలో నేపాల్ కు చెందిన సూర్యసింగ్, రమేష్‌బహధూర్ అనే ఇద్దరు వ్యక్తులు అద్దెకు ఉంటున్నారు. వీరు ధూల్‌పేట్‌కు చెందిన అభిషేక్ సింగ్ వద్ద తరుచు గంజాయిని తీసుకవచ్చి మలక్‌పేట్ ప్రాంతంలో ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితులు నివాసముంటున్న అద్దె ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించగా 6కేజీల గంజాయి బయటపడింది. ఈ దాడిలో సీఐ ఏ నరేందర్‌తోపాటు ఎస్సైలు సుజాత, శివ చరణ్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌లు, సురేందర్, ప్రసాద్, శంకర్, విక్రమ్‌లు పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ లో అధికారుల అప్రమత్తత, సోదాలు గంజాయి వ్యాపారులకు వెన్నులో వణుకు పుడుతోందని పై అధికారులు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పూర్తిగా రూపుమాపే వరకు కొనసాగుతుందన్నారు.