మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి
By Ravi
On
హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భువనేశ్వరి నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మస్కిటో కాయిల్ పరుపు మీద పడి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి మృతిచెందగా.. మరో చిన్నారిక పరిస్థితి విషమంగా ఉంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్.. అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపుపై పడి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరాడక రెహమాన్ స్పాట్లోనే మృతిచెందాడు. ఇంకో కుమారుడు అతిఫా ఆరోగ్యం విషమంగా ఉండడంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
26 Apr 2025 21:29:15
- ఒక్కొక్కటిగా వెలుగులోకి బ్యూరోక్రాట్స్ భూదందాలు
- ముందే చెప్పిన ట్రూ పాయింట్ న్యూస్ - నార్త్ బ్యూరోక్రాట్స్ అడ్డగోలు భూముల కొనుగోలు - డ్యూటీలో జాయిన్...