భారీ ప్రమాదం.. పరుగులు తీసిన జనం
చందానగర్ గంగారాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో షాపింగ్ మాల్స్ లో ఉన్న కస్టమర్లు, జనం భయంతో పరుగులు తీశారు. సెంట్రో షాపింగ్ మాల్ లో మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు చూస్తుండగానే మాల్ మొత్తం వ్యాపించాయి. దాని నుండి పక్కనే ఉన్న ఆర్.కె కలెక్షన్ షోరూమ్ కి సైతం పాకాయి. రెండు షోరూమ్స్ మంటల్లో చుక్కుకోవడమే కాకుండా పక్కనే ఉన్న మరికొన్ని షాపింగ్ మాల్డ్ కి ప్రమాదం జరిగి పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల వారిని దూరంగా పంపివేశారు. ట్రాఫిక్ జామ్ నివారించేందుకు పోలీసులు దారిమల్లింపు చేపట్టారు. సెంట్రో షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. షాపింగ్ మాల్స్ లో ఎవరన్నా సిబ్బంది ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానిక వాటర్ వర్క్స్ అధికారులు సైతం ఫైర్ ఇంజన్లకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఘాటైన పొగ మంటలతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. వెనుక ఉన్న మరో షోరూమ్, పక్కనే ఉన్న ఒంబ్ హాస్పిటల్ కి సైతం మంటలు వ్యాపించాయి. ఆస్పత్రిలో ఉన్న పేషంట్లను మరో ఆస్పత్రికి తరిస్తున్నారు.