మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
By Ravi
On
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గుల్ లోని విజయలక్ష్మి కాలనీ రోడ్ ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వర్షం నీరు, డ్రైనేజీ ఎలా పోతుందని ప్రశ్నించారు. గతంలో కనెక్టివిటీ రోడ్డుగా చూపెట్టి నేడు ఫ్లాటుగా నిర్మాణాలు చేపట్టడంపై మండిపడ్డారు. రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడుతున్నారని గతంలో మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రోడ్డును కబ్జా చేసి కడుతున్న నిర్మాణాన్ని తీసివేయాలని బడంగ్పేట్ మున్సిపల్, హైడ్రా అధికారులను కోరారు. వర్షం నీరు, డ్రైనేజీ కిందకు పోకపోతే కాలనీ చెరువుల మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
Tags:
Latest News
27 Apr 2025 05:35:51
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...