దోపిడీ దొంగల ముఠా గుట్టు రట్టు..!

By Ravi
On
దోపిడీ దొంగల ముఠా గుట్టు రట్టు..!

హైదరాబాద్ TPN : రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిదిలోని సన్‌సిటీలో పీ అండ్ టీ కాలనీలో చోరీకి పాల్పడిన దోపిడీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాధితుడు మహమ్మద్ షకీర్ అలీ తాను మరియు తన కుటుంబం ఇంట్లో ఉన్నప్పుడు, నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు తలుపు తట్టి, బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి, కత్తితో బెదిరించి తనను తన భార్యను బెదిరించారని ఫిర్యాదు చేశారు. నిందితులు అల్మారాను పగలగొట్టి, బంగారంతోపాటు వెండి ఆభరణాలు, నగదు, రెండు మొబైల్ ఫోన్‌లను దోచుకుని పారిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల దర్యాప్తులో.. ఫిర్యాదుదారుని బంధువైన ఏ1కి ఇంట్లోని విలువైన వస్తువుల గురించి ముందే తెలుసని వెల్లడైంది. అతను ఒక పథకం వేసుకుని, ఇతర నిందితులతో కుట్ర పన్నాడని దర్యాప్తులో తేలింది. నేరం అమలు చేయడానికి ఏ1 ఆయుధాలతోపాటు తప్పించుకునే వాహనాన్ని కూడా ఏర్పాటు చేశాడు. నేరం జరిగిన నాలుగు రోజుల్లోనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సాధారణ పరిచయస్తులు లేదా విస్తృత బంధువులతో వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను పంచుకోవద్దని పోలీసులు సూచించారు. ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులను ఉంచుకోవద్దని.. సురక్షితమైన లాకర్లను ఉపయోగించండని చెప్పారు.

Advertisement

Latest News

బ్యూరోక్రాట్స్‌ భూదందా..! బ్యూరోక్రాట్స్‌ భూదందా..!
- ఒక్కొక్కటిగా వెలుగులోకి బ్యూరోక్రాట్స్‌ భూదందాలు - ముందే చెప్పిన ట్రూ పాయింట్ న్యూస్ - నార్త్‌ బ్యూరోక్రాట్స్‌ అడ్డగోలు భూముల కొనుగోలు  - డ్యూటీలో జాయిన్‌...
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి
దుండిగల్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు..!
ఘనంగా ఏసీపీ ఆనంద్‌ అజయ్‌రావు పదవీ విరమణ..!
మహేశ్వరం జోన్‌లో 855 సీసీ కెమెరాలను ప్రారంభించిన కమిషనర్‌ సుధీర్‌బాబు..!
ఇరాన్ పోర్టులో భారీ పేలుడు..
ట్రంప్‌, జెలెన్‌ స్కీ ల మధ్య భేటీ..