ఘనంగా ఏసీపీ ఆనంద్‌ అజయ్‌రావు పదవీ విరమణ..!

By Ravi
On
ఘనంగా ఏసీపీ ఆనంద్‌ అజయ్‌రావు పదవీ విరమణ..!

నిజాలు మాట్లాడే వ్యక్తుల్లో ఎక్సైజ్‌శాఖ అడిషనల్‌ కమిషనర్‌ ఆనంద్‌ అజయ్‌రావు ఒకరుగా ఉంటారని తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ చెవ్వూరు హరికిరణ్‌ అన్నారు. అబ్కారీ భవన్‌లో ఎక్సైజ్‌శాఖ అడిషనల్‌ కమిషనర్‌గా ఉన్న ఆనంద్ అజయ్‌రావు  పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిషనర్‌గా వచ్చి ఐదు నెలలు మాత్రమే అయ్యిందని.. అబ్కారీ భవన్‌లో అధికారులు, ఇతరుల పరిస్థితి ఏంటి..? ఎలా ఉంటారని అడిగితే మాత్రం అజయ్‌రావు సమాధానం ఇవ్వలేదని హరికిరణ్‌ చెప్పారు. 

అంటే ఎవ్వరి గురించి కూడా ఎలాంటి అభిప్రాయాలు చెప్పడానికి ఆయన ఇష్టం చూపించే వ్యక్తి కాదని అప్పుడు తనకు అర్థమైందని అభిప్రాయపడ్డారు. కానీ.. ఏదైన విషయంలో విచారణ చేయాలని అడిగితే.. వెంటనే ఇతరుల అభిప్రాయాలను తెలుసుకొని వారు చెప్పినట్లుగా చెప్పిన అధికారిని చూడడం ఇదే మొదటిసారి అన్నారు. ఇలాంటి అధికారి పదవీ విరమణ పొందడం సంస్థకు లోటుగానే  ఉంటుందన్నారు. 

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరిన వ్యక్తికి మొదటిరోజే పదవీ విరమణ పొందే తేదీ తెలిసివస్తుందని.. కానీ.. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు ఏదో కోల్పోయామని.. చాలామంది మిత్రులను విడిచిపెట్టి వెళుతున్నామనే బాధలో ఉండడం  సహజంగా ఉంటుందన్నారు. 31 సంవత్సరాల ఉద్యోగంలో అనేక సాహసాలు చేశామని..                  మంచిచెడులను చూశామని.. కానీ.. ఏనాడు ఎవ్వరికి బెదరకుండ ధైర్యంగా పనిచేస్తూ ఒక్క మచ్చ లేకుండా పదవీ విరమణ   పొందినందుకు సంతోషంగా ఉందని అడిషనల్‌ కమిషనర్‌ అజయ్‌రావు అన్నారు. ఈ కార్యక్రమానికి కమిషనర్‌, డైరెక్టర్‌తోపాటు ఇన్‌చార్జ్  అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, జాయింట్‌ కమిషనర్లు రాథోడ్‌ సురేష్‌, కేఏబీ శాస్త్రీ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం అజయ్‌రావు, ఆయన సతీమణి అనురాధాకు అధికారులతోపాటు అందరు సన్మానం చేశారు. పదవీ విరమణ సభా కార్యక్రమాన్ని మెదక్‌ డిప్యూటీ కమిషనర్‌ హరికిరణ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డేవిడ్‌, రవికాంత్‌, దశరథ్‌, సోమిరెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Latest News