మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం

By Ravi
On
మిస్ వరల్డ్ 2025  పోటీలకు సర్వం సిద్ధం

ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. శనివారం (10.05.2025) సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్ పోర్టుతో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి రానున్న రెండు రోజుల్లో వస్తారని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. గత వారం రోజులుగా వస్తున్నఅతిధులు అందరినీ తెలంగాణ సంసృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. 
ఇవాళ, రేపు ఈ కంటెస్టంట్లు రిహార్సల్స్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారు పాల్గొనబోయే కార్యక్రమాల బ్రీఫింగ్ నిర్వాహకులు  చేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన కంటెస్టంట్లు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్ లో భాగంగా చేపడుతున్నారు. 
ఏర్పాట్లపై ఇప్పటకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ప్రకృతి, పర్యావరణ పరంగా అన్నిహంగులు ఉన్నా, తెలంగాణ ఆరంగంలో వెనుకబడిందని, ఇకపై తెలంగాణ జరూర్ ఆనా (తప్పకుండా తెలంగాణ రండి, పర్యటించండి.) అనే నినాదాన్ని విసృతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పర్యాటకరంగం పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఏర్పోర్ పోర్టుల్లో ప్రచారం కల్పిస్తుంది. ఇక వివిధ ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకూ కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టూరిజం వెబ్ సైట్ లో రిజిస్టర్ (https://tourism.telangana.gov.in/events-single/miss-world-event) చేసుకున్న వారికి ఐదు కేంద్రాల్లో వేయి మందికి చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.Screenshot_20250508_134828_Chrome

Tags:

Advertisement

Latest News

ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్ ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
విధి నిర్వహణలో రానించేందుకు ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ అసిస్టెంట్ ఎస్పీలతో అన్నారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు,...
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి