పంజాగుట్ట కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్.. బెయిల్ మంజూరు
పంజాగుట్ట కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్ అయ్యారు. షకీల్ ను అరెస్టు చేసిన అనంతరం కోర్ట్ లో హాజరు పరచగా అనారోగ్య కారణాలు చూపెట్టడంతో కోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 డిసెంబర్ లో ప్రజా భవన్ ముందు షకీల్ కుమారుడు రాహిల్ తప్పతాగి కారు నడుపుతూ బ్యారికెడ్ ను ఢీకొట్టాడు. పోలీసులు అదుపులోకి తీసుకోగా పోలీస్ కస్టడీ నుండి పారిపోవడంతో పాటు రాహిల్ కు బదులు వేరే వ్యక్తిని పోలీసులు ముందు లొంగిపోయేలా షకీల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయి పోలీస్ స్టేషన్ లో సిఐ తో సహా హోమ్ గార్డ్ వరకు అందరిని బదిలీ చేశారు. అనంతరం సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసిన షకీల్ పై కూడా కేసు నమోదైంది. క్రితం దుబాయ్ నుండి ఇండియాకు వచ్చిన షకీల్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచగా అన్ని సెక్షన్స్ ఏడు సంవత్సరాల లోపు ఉండటంతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.