అఘోరీ గురించి నిజాలు చెప్పిన ప్రత్యక్షసాక్షి..!
అఘోరి అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తిని తొమ్మిది లక్షలు తీసుకొని చంపేస్తానంటూ బెదిరించిన కేసులో మోకిలా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ రిమాండ్‌కు తరలిస్తున్న క్రమంలో ప్రత్యక్ష సాక్షిగా శంకర్‌పల్లి మండలం మహారాజ్‌పేట్ గ్రామానికి చెందిన హరి ముదిరాజ్‌ను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మా ప్రతినిధితో మాట్లాడుతూ.. అఘోరీ గురించి అసలు నిజాలు బయటపెట్టాడు. అఘోరి అసలు మహిళే కాదని.. అతని పేరు శ్రీనివాస్ అని చెప్పాడు. అతని తలపై ఉంది కూడా నిజమైన జుట్టు కాదని.. అది కొనుక్కొని తగిలించుకున్న విగ్గు తెలిపాడు. శ్రీ వర్షిణి చెప్పినట్టు అఘోరీ శాకాహారి కాదని మాంసాహారని.. అలాగే మద్యం కూడా సేవిస్తున్నట్లు వివరించాడు. తానెందుకు షూరిటీ పెట్టాలని అడిగినప్పుడు.. ఇలాంటి తప్పు మరొకసారి చేయనని చెప్పినట్టు హరి తెలిపాడు. అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా తెలివిగల వాడని.. ఎంతోమందిని మోసం చేశాడని.. తన అకౌంట్లో డబ్బులు కనిపించకుండా.. తనకు వచ్చిన డబ్బులను వేరే వారి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేవాడని చెప్పుకొచ్చాడు. ప్రగతి రిసార్ట్స్‌లో ఉన్న మహిళా ప్రొడ్యూసర్‌ను నమ్మించి.. నీ సినిమాలు బాగా ఆడేటట్టు చేస్తానని.. దానికి పూజలు చేయాలని.. ఉజ్జయిని తీసుకెళ్లి నగ్న పూజలు చేయించాడని అఘోరీ చెప్పినట్లు హరి తెలిపాడు. ఇప్పటివరకు చాలామందిని పూజలు చేయిస్తానని మోసం చేశాడని హరి మీడియా ముఖంగా చెప్పాడు.