ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు
By Ravi
On
పాతబస్తీలో ఫుల్ టెన్షన్ నెలకొంది. చాంద్రాయణగుట్టలో తెల్లవారుజామున హైడ్రా రంగంలోకి దిగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాబానగర్ సర్వే నెంబర్ 303, 306 కి చెందిన 2000 గజాల స్థలం ఆక్రమణకు గురైనట్లు హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణ చేపట్టిన అనంతరం కూల్చివేతలు మొదలు పెట్టారు. దీనితో ఆగ్రహించిన ఎంఐఎం నేతలు, బాబానగర్ వాసులు ఆందోళనకు దిగారు. రంగనాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కూల్చివేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన 2000 గజాల స్థలంలో నిర్మాణం అయిన భవనాలను నేలమట్టం చేసి స్థలం స్వాదీనం చేసుకున్నారు.
Tags:
Latest News
10 May 2025 17:08:51
మలక్ పేటలోని మామిడిపండ్ల గోదాంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్ ను వినియోగిస్తూ కృత్రిమ...