మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ వద్ద బాణసంచా పేల్చి స్వీట్స్ పంచారు. ఓబులాపురం గనుల కేసులో సీబీఐ కోర్టు సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సీబీఐ కోర్ట్ తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆ నమ్మకమే 12 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నేడు కోర్టులో ఈ సానుకూలమైన తీర్పుకు దారితీసిందన్నారు. చీమకైనా హాని చేయని మనస్తత్వం కలిగిన సబితా ఇంద్రారెడ్డి మచ్చలేని మనిషిగా నిలిచారని మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటార అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శీను నాయక్, దీప్లాల్ చౌహాన్, సిద్దాల బీరప్ప, అనిల్ యాదవ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్ కుమార్, సునీత బాలరాజ్, విజయలక్ష్మి, సుర్వి లత, మదారి రమేష్, గోపి యాదవ్, లక్ష్మణ్, సిద్దాల అంజయ్య, వెంకట్ రెడ్డి, సహదేవ్, అవినాష్ మాచర్ల, శేఖర్ గౌడ్, రజాక్, జగాల్ రెడ్డి, వెంకటేష్, రామకృష్ణ, యాదగిరి, నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.