పవన్‌పై మోదీ కన్సర్న్ వెనుక పెద్ద ప్లాన్..!
- అమరావతిలో పవన్‌పై మోదీ స్పెషల్ కన్సర్న్
- పవన్‌కు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ
- ఏ వేదికైనా పవన్‌పై మోదీ స్పెషల్ ఇంట్రస్ట్
- మోదీ కన్సర్న్ వెనుక రాజకీయ కారణాలు
- పవన్‌ను అడ్డుపెట్టుకుని ఏపీలో ఎదిగే ప్రయత్నాలు
- మోదీ, పవన్ ఏపీసోడ్‌పై నెట్టింట్లో మీమ్స్ వైరల్
అమరావతి పునఃప్రారంభ వేడుకపై మోదీ చేసిప పని ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. మీమర్స్ చేతికి పనిచెప్పింది. ప్రధాని మోదీ ఏ మీటింగ్‌కు హాజరైనా.. అక్కడ జనాల అటెన్షన్‌ని తనవైపు తిప్పుకుంటూ ఉంటారు. అలాగే అమరావతిలో కూడా మోదీ తన స్టైల్ మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో దగ్గుతూ కనిపించారు. ఇది గమనించిన మోదీ.. దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. పవన్ ప్రసంగం పూర్తయ్యాక.. తన దగ్గరకు పిలుపించుకుని.. గొంతులో కిచ్‌కిచా.. ఇదిగో విక్స్ తీసుకో అంటూ పవన్ చేతిలో ఓ చాక్లెట్ పెట్టారు. దీంతో అక్కడే ఉన్న సీఎం చంద్రబాబుతోపాటు మిగతా మినిష్టర్స్ కూడా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. పవన్ కూడా షాకై.. ఓ చిరునవ్వు విసిరారు. గతంలో ఢిల్లీలో బీజేపీ సీఎం ప్రమాణస్వీకారానికి హాజరైన పవన్‌ని.. స్పెషల్‌గా తన దగ్గరకెళ్లి పలకరించారు మోదీ. ఎప్పుడూ కాషాయ వస్త్రాల్లోనే కనిపిస్తావు.. హిమాలయాలకు వెళతావా ఏంటి..? అంటూ ఛలోక్తులు కూడా విసిరారు. ఐతే.. స్టేజ్‌పైన చాలామంది బడాబడా నేతలున్నా.. పవన్ ఉంటే మాత్రం మోదీ ఆయనపై ఎక్కువగా కన్సర్న్ చూపిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ లీడర్‌గా పిలవబడే మోదీ.. పవన్‌కి ఎందుకు ఇంతలా కనెక్ట్ అయ్యారనేది అర్థం అవ్వడం లేదని సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకున్నారు.
మరోవైపు పవన్‌పై మోదీ కన్సర్న్ వెనకాల పెద్ద ప్లానే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్ద పేరున్న లీడర్స్ లేరు. అటు పవన్ కూడా బీజేపీతో బాగా మింగిల్ అయిపోయారు. దీంతో పవన్‌ను అడ్డుపెట్టుకుని ఏపీలో బీజేపీ ఎదగాలనే ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పవన్‌పై స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ.. ఆయన్ని అభిమానించే వాళ్లని తమవైపు తిప్పుకోవాలన్నదే మోదీ ప్లాన్ అని సమాచారం. భవిష్యత్‌లో పవన్‌ని బీజేపీలోకి లాగేసుకుంటే.. ఏపీలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందన్నది బీజేపీ భావన. సౌత్‌లో ఇప్పటిదాకా కర్ణాటక తప్ప.. బీజేపీ సొంతంగా గెలిచిన రాష్ట్రం ఏదీ లేదు. ఇప్పుడు ఏపీలో పవన్ రూపంలో బీజేపీకి కొత్త శక్తి దొరికిందన్నది మోదీ యోచన. అందుకు వీలైనప్పుడల్లా అయన పవన్ జపం చేస్తుంటారు. పవన్‌ను ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు. మరోవైపు పవన్‌పై మోదీ చూపిస్తున్న అభిమానానికి జనసైనికులతోపాటు పవన్ ఫ్యాన్స్ కూడా చొక్కాలు చించుకుంటున్నారు.
ఇకపోతే.. అమరావతిలో పవన్‌కు మోదీ చాక్లెట్ ఇవ్వడంపై మీమర్స్ తమదైన స్టైల్లో మీమ్స్ వదులుతున్నారు. అమరావతి పునఃప్రారంభ ఆహ్వాన పత్రికలో మొదట డిప్యూటీ సీఎం పవన్ పేరే లేదట. తర్వాత మళ్లీ ఆయన పేరుని కలిపి ఆహ్వాన పత్రికలు సిద్ధం చేశారట. దీంతో పవన్ అలక తీర్చడానికే మోదీ ఆయనకు చాక్లెట్ ఇచ్చారని ఓ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకోవైపు.. అమరావతికి మోదీ ఏ వరాలు ఇవ్వకుండా ఇలా పవన్‌కు చాక్లెట్ ఇచ్చి చాల్లే అన్నారంటూ.. ఇంకో మీమ్ వైరల్‌గా మారింది. మొత్తానికి పవన్‌కు ఓ చిన్న విక్స్ ఇచ్చి.. జనాల అటెన్షన్ మొత్తం మోదీ తనవైపు తిప్పుకున్నారు.