దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..!
By Ravi
On
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎర్రబోడలో రమేష్, రాజేశ్వరి దంపతులు హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరినీ హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ భార్య రాజేశ్వరి మృతిచెందింది. కడుపులో పేగులు కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. అటు భర్త రమేష్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
03 May 2025 21:45:44
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఆర్టీసీ బస్ , ట్రావెల్స్ బస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ...