కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట..!
By Ravi
On
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రక్షాళణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఅర్ ఆధార రహిత ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుగుణ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఊట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ తుది తీర్పు వెల్లడించారు. హైకోర్టు తీర్పుతో కేటీఆర్ ఊపిరి పీల్చుకున్నారు.
Related Posts
Latest News
03 May 2025 21:45:44
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఆర్టీసీ బస్ , ట్రావెల్స్ బస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ...