భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న కవిత..!
By Ravi
On
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేవాలయంలోకి ఘనస్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్న కవిత అనంతరం లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తదుపరి దేవాలయం ముందు గల ఆంజనేయ స్వామి దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఎమ్మెల్సీ కవితతోపాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతోపాటు తాతా మధు, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాచలం పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, సునీల్, రేపాక పూర్ణచంద్రరావు పాల్గొన్నారు
Related Posts
Latest News
03 May 2025 19:03:18
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వేసవి శిబిరం-2025ని ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 25 మంది విద్యార్థులతోపాటు కొంతమంది చిన్నవయసు శిబిరార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెహ్రూ జూలాజికల్...