హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడి.. గంజాయి స్వాధీనం
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పురానాపూల్ ప్రాంతం జియాగూడ ప్రాంతాల్లో ఎస్టి ఎఫ్ఏటీమ్ నిర్వహించిన దాడుల్లో 2.078 కేజీల గంజాయిని పట్టుబడింది. స్క్రూటీపై గంజాయిని అమ్మకానికి తీసుకు వెళుతుండగా ఎస్ టి ఎఫ్ టీమ్ పట్టుకుని సంజయ్‌సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరో కేసులో..
మూసాపేట్ జేపి, భరత్‌నగర్ ప్రాంతాల్లో ఎస్టి ఎఫ్ డి టీమ్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈస్ట్ గోదావరి జి ల్లాకు చెందిన కొంపల్లి యశ్వంత్ సాయి షణ్ముఖ వద్ద 1.20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, ఒక బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడు బంధువుల ఇంట్లో ఉంటూ అరకు వెళ్లి గంజాయి తీసుకొని వచ్చి హైదారాబాద్‌లో అమ్మకాలు జరుపుతుంటాడని ఎస్సై తెలిపారు.