పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!

By Ravi
On
పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!

హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి తీవ్రఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను అమానుషమైనవిగా అభివర్ణించిన వారు, నిరసనల పేరుతో కొందరు ముష్కరులు హిందువులపై దాడులు చేసి హత్యలు చేయడాన్ని ఖండించారు. సైదాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు.అనంతరం నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి, పశ్చిమబెంగల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ దాడుల వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సంఘటనలు హిందువుల శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు సుభాష్ చందర్, సహదేవ్ యాదవ్, వీరేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, దశరథ లక్ష్మి, ఉగాది మహేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..