చిలుకూరు అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన రాఘవరెడ్డిపై దాడి.. తీవ్రగాయాలు
By Ravi
On
మొయినాబాద్ పిఎస్ పరిధిలో వీర రాఘవరెడ్డిపై దాడి జరిగింది. గుర్తుతెలియని 20 మంది ఆయనను విచక్షణ రహితంగా కొట్టారు. ఇటీవల చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసి జైలుకి వెళ్లాడు. కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన మొయినాబాద్ పిఎస్ లో సంతకం చేసి తిరిగి ఇంటికి వెళ్తూ ఓ టీ స్టాల్ వద్ద ఆగడు. అక్కడే ఉన్న 20 మంది ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీర రాఘవరెడ్డి వెంటనే పిఎస్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రంగరాజన్ పై దాడి చేయడంతో తట్టుకోలేని జనం దాడి చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Latest News
03 May 2025 12:18:25
బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పరిశీలించారు. సర్వే నెంబర్...