ప్లేఆఫ్స్ రేస్ నుంచి చెన్నై అవుట్..
తాజాగా జరిగిన చెన్నై, పంజాబ్ మ్యాచ్ తర్వాత చెన్నై టీమ్ ప్లే ఆఫ్స్ నుండి ఎగ్జిట్ అయ్యింది. శ్రేయాస్ అయ్యర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అర్ధ సెంచరీలతో పాటు యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించడంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో, 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 18వ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. చెన్నై బ్యాట్స్ మెన్ సొంత గడ్డపై చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవడంతో పంజాబ్ జట్టు విన్నింగ్ పాయింట్ ఈజీ అయ్యింది. చెన్నై బ్యాటింగ్ మరోసారి పూర్తిగా తడబడింది.
సామ్ కరన్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా, చెన్నై 190 పరుగులకు ఆలౌట్ అయింది. ఫస్ట్ వికెట్లు పడటంతో సామ్ కరన్ క్రీజులోకి వచ్చాడు. అతను 47 బంతులను ఎదుర్కొని 88 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పంజాబ్ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ బాగా బౌలింగ్ చేసి చెన్నై ఓపెనర్లను పెవిలియన్ కు పంపారు. పవర్ ప్లేలోనే షేక్ రషీద్, ఆయుష్ ఔట్ కావడంతో జట్టు 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్ మొదట రషీద్‌ను క్యాచ్‌తో అవుట్ చేయగా, ఆ తర్వాత యాన్సన్‌ను అయ్యర్ క్యాచ్‌తో అవుట్ చేశాడు.